వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసు..
బెంగుళూరు పోలీసులతో ఏపీ కేడర్ ఐఏఎస్ వికాస్ మర్మత్ ఘర్షణ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం వికాస్ మర్శత్ ఘర్షణ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎస్‌కు సీఎం స్పష్టం చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్ అధికారి వికాస్ మర్మత్. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.2026, అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి బెంగళూరులోని పబ్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు...