రాహుల్‌‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం..

బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జనహిత యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని జ్ఞానేశ్ కుమార్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తోందని విరుచుకుపడ్డారు. కర్ణాటక సీఎం డీకే.శివకుమార్‌ను రాహుల్ సెక్యూరిటీ తోసేశారని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దుష్ప్రచారం మొదలు పెట్టిందని ఎంపీ ఆరోపించారు. రాహుల్ ర్యాలీలో కాంగ్రెస్...