జోస్ బ‌ట్ల‌ర్‌కు స‌ర్జ‌రీ..

ఇంగ్లండ్ క్రికెట‌ర్, టాప్ ఫామ్‌లో ఉన్న బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌కు స‌ర్జ‌రీ అయ్యింది. ఎడ‌మ‌కాలి తొడ కండ‌రాల‌కు శ‌స్త్ర‌చికిత్స జ‌రిగిన‌ట్లు ఆయ‌న త‌న ఇన్‌స్టాలో ఓ పోస్టు చేశారు. గ‌త నెల‌లో శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. సెప్టెంబ‌ర్ 24వ తేదీన ఆ మ్యాచ్ ఇంగ్లండ్ ఓట‌మి పాలైంది. ఆ మ్యాచ్‌లో అత‌ను బ్యాటింగ్ చేస్తూ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఆ త‌ర్వాత అత‌న్ని సిరీస్ నుంచి త‌ప్పించారు. ఇక త్వ‌ర‌లో పాకిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న సిరీస్‌కు కూడా బ‌ట్ల‌ర్ దూరం కానున్నాడు. న‌వంబ‌ర్‌లో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న సిరీస్‌కు కూడా బ‌ట్ల‌ర్ దూరంకానున్న‌ట్లు తెలుస్తోంది. ఆ సిరీస్‌కు చెందిన బృందాన్ని మంగ‌ళ‌వార‌మే ప్ర‌క‌టించ‌నున్నారు.సోమవారం...