త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు విక్టరీ కొట్టింది. గ్రూపు బీలో భాగంగా త్రిపురతో సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో సిరాజ్ సేన విజయాన్ని నమోదు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర కేవలం 120 పరుగులకే ఆలౌటైంది. హైదరాబాదీ స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి త్రిపురను దెబ్బతీశాడు.ఈ మ్యాచ్‌లో త్యాగరాజన్ మొత్తం తన ఖాతాలో 9 వికెట్లు వేసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అతను మూడు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో వికెట్లు దక్కని సిరాజ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు దక్కాయి. గ్రూపు బీలో తొలి మ్యాచ్ నెగ్గిన హైదరాబాద్ జట్టుకు ఏడు పాయింట్లు...