ఆర్థిక శాస్త్రంలో 2026 నోబెల్ పురస్కార గ్రహీతలకు తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం అభినందనలు

ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడే పరిశోధనలు సమాజానికి ఎంతో ప్రయోజనకరం 2026 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ అమెరికన్ ఆర్థిక శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ రాబర్ట్ ఈ. హాల్ , ప్రొఫెసర్ మైఖేల్ వుడ్‌ఫోర్డ్లకు తెలంగాణ ఎకనామిక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ చీకోటి శ్రీనివాస్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని సాధించడానికి, ఆర్థిక సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి దోహదపడే పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆర్థిక శాస్త్ర రంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. సూక్ష్మ ఆర్థిక సిద్ధాంతాల...