తీదేడులో వైభవంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి: సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా తీదేడు గ్రామంలోని రామాలయం వద్ద ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.పూల బతుకమ్మలతో రామాలయం పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ...