ఎస్పీ అదేశాలతో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు
- మల్లంపల్లిలో ముమ్మర వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు - నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు - డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించిన ఎస్సై చంద్ర శేఖర్. ములుగు జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 09 (బీవీకే న్యూస్): ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ క్రాస్ వద్ద జాతీయ రహదారిపై ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకేన్ ఆదేశాలతో ఇసుక లారీల అతివేగం,డ్రైవర్ల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ముమ్మర తనిఖీలు చేపట్టామని ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. మల్లంపల్లి శ్రీనగర్ ప్రధాన రహదారిపై వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ...