ఉపాధ్యాయుల కొరత.. వాలంటీర్లకు సర్పంచులే జీతాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో.. సమస్యను అధిగమించేందుకు గ్రామ సర్పంచులు, గ్రామస్తులే ముందుకొస్తున్నారు. మాగనూరు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా ఉండేందుకు సొంత నిధులతో విద్యా వాలంటీర్లను నియమించుకుని వారికి జీతాలు చెల్లిస్తున్నారు.మందిపల్లి, అమ్మపల్లి, పరమందొడ్డి, పెగడబండ, పుంజనూరు, గురురావులింగంపల్లి, తాళంకేరి, బైరంపల్లి తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొన్నదని గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉన్నప్పటికీ.. అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని వారు...