‘ఎమ్మెల్సీ విజయం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలి’
పట్టభద్రుల ఎమ్మెలీ ఎన్నికల్లో రాకేశ్‌రెడ్డిని గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంట్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మంగళవారం ఎమ్మెల్సీ తాతామధు అధ్యక్షతన కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ రావాలి.. రేవంత్ పోవాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను అసహించుకుంటున్నారన్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని ఇక బీఆర్ఎస్‌దే అధికారం అన్నారు. పట్టభద్రులు...