హైదరాబాద్‌లో ధోనీ.. ‘7పాడెల్’ ఫిట్‌నెస్, వెల్‌నెస్ కేంద్రం ప్రారంభించిన క్రికెట్ దిగ్గజం..!

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హైదరాబాద్‌లో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ‘7పాడెల్ ఎంఎస్ ధోనీ’ పాడెల్, ఫిట్‌నెస్, వెల్‌నెస్ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారీ దిగ్గజం. సుమారు 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిగా ఇండోర్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మూడు పాడెల్ కోర్టులు, జిమ్, రికవరీ సూట్, సౌనా, ఐస్ బాత్, ఇన్‌ఫ్రారెడ్ గది, యోగా, పైలేట్స్ స్టూడియో తదితర సదుపాయాలు ఉన్నాయి.‘7పాడెల్ ఎంఎస్ ధోనీ’ ఫిట్‌నెస్, వెల్‌నెస్ కేంద్రం ప్రారంభం సందర్భంగా ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. ‘‘ఒక క్రీడను అభివృద్ధి చేసేందుకు అడ్డదారులు ఉండవు. మంచి కోర్టులను నిర్మించాలి. ఆడేవారికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. క్రీడల్లో...