పోలీస్‌స్టేషన్‌లో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం భీమ్‌గల్‌లో చోటుచేసుకుంది.బాధితుడి కథనం ప్రకారం.. భీమ్‌గల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్‌ను లేట్‌నైట్ వరకు హోటల్ నిర్వహిస్తున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఇప్పటికే తనపై మూడుసార్లు జరిమానా విధించారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా జరిమానా విధించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి జరిమానా చెల్లించి రావాలని ఆదేశించినట్లు తెలిపారు. తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం...