శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని డీఆర్ఐ అధికారులకు అప్పగించారు. ఆ ప్రయాణికుడిని వారు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.