సుప్రీంకోర్టుకే ఉచిత సలహాలు..

విచారణ గడువు పెంపు కోసం లేఖ.. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ (బారాసత్) మూడో కోర్టుకు చెందిన అదనపు జిల్లా , సెషన్స్ జడ్జి ఈ వింత పరిస్థితికి కారణమయ్యారు. గత ఐదేళ్లుగా జైలులోనే విచారణ ఎదుర్కొంటున్న ఒక నిందితుడి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గత మే 11న తిరస్కరించింది. కేసు విచారణ చాలా నెమ్మదిగా సాగుతుండటంతో, రాబోయే మూడు నెలల్లోనే విచారణను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. అయితే, నిర్దేశిత సమయంలో విచారణ పూర్తి కాకపోవడంతో, మరికొంత సమయం కావాలంటూ అగష్టు 11న సదరు జడ్జి సుప్రీంకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ లేఖ వరకు బాగానే...