పైలట్ మచ్చార్‌పై దాడి.. అధికారుల విచారణలో బయటపడిన కుట్ర
భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేయడంతో పాటు ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించిన ఘటనలో అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. కోపైలట్ పేరు హమామ్ అల్ హమామీ అని, ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించినట్లు వివిధ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆ మీడియా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ముందుగా ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై దాడిచేసి, విమానాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి హమామీ పథకం పన్నాడు. ఈ ప్లాన్‌లో భాగంగా అతను మచ్చార్‌పై తీవ్రంగా దాడి చేశాడు. కానీ, మచ్చార్ తన ప్రాణాలను పణంగా పెట్టి...