భారత్-పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు..

ఆసియా క్రీడలు-2026లో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్థాన్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. పురుషుల క్రికెట్‌ విభాగంలో స్వర్ణ పతకం కోసం శనివారం దాయాది దేశాలు తలపడనున్నాయి. అయితే మ్యాచ్ జరిగే స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఆటకు అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారత్‌-పాక్‌ ఫైనల్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. వాతావరణ పరిస్థితుల అంచనా ప్రకారం ఉదయం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండగా.. మధ్యాహ్నానికి అది తగ్గే అవకాశముంది. ఉష్ణోగ్రత సుమారు 20 డిగ్రీల సెల్సియస్‌ ఉండొచ్చని అంచనా. మ్యాచ్‌ జరగాల్సిన సమయంలో వర్షం పూర్తిగా తగ్గకపోతే ఇరు జట్లకు ఇబ్బందులు తప్పవు....