ఫ్లైదుబాయ్ విమానానికి ప్రమాదం ఎలా తప్పిందంటే?

ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఫ్లైట్‌లో ఐదు మిరాకిల్స్‌ జరిగాయి. దీంతో హైజాకింగ్‌ వంటి ఉగ్రవాద కుట్రతోపాటు కూలే ప్రమాదం నుంచి ఆ విమానం బయటపడింది. ఆ ఫ్లైట్‌లోని ఐదుగురు హీరోలు సకాలంలో స్పందించారు. ఘోర విమాన ప్రమాదాన్ని వారు తప్పించారు. సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్‌జెడ్‌ 1073 విమానం 174 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. ఆ విమానం 30,000 అడుగుల ఎత్తులో ఎగురుతుండగా ఒమన్ దేశస్థుడైన కో-పైలట్ హైజాకింగ్ ప్రయత్నం చేశాడు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. కాక్‌పిట్‌లో జరుగుతున్న ఈ దాడి కారణంగా ఆ విమానం అదుపుతప్పింది. సుమారు రెండు...