జ్ఞానేష్ కుమార్ కాదు.. వ్యానిష్ కుమార్..

స‌ర్ విష‌యంపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్ అంశంపై వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై ప‌శ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. ఓట్ల‌ను, ఓట‌ర్ల హ‌క్కుల‌ను సీఈసీ జ్ఞానేష్ కుమార్ తొల‌గిస్తున్నాడ‌ని, అందువ‌ల్ల అత‌డు జ్ఞానేష్ కుమార్ కాద‌ని, వ్యానిష్ కుమార్ అంటూ అభివ‌ర్ణించారు. వ్యానిష్ అంటే తొల‌గించ‌డం, క‌నిపించ‌కుండా పోవ‌డం వంటి అర్థాలున్న సంగ‌తి తెలిసిందే.జ్ఞానేష్ కుమార్ స‌ర్ ద్వారా ఓట్ల‌ను తొల‌గిస్తుండ‌టంతో మ‌మ‌త ఆయ‌న‌ను ఇలా పోల్చారు. అలాగే, స‌ర్ ప్రక్రియ‌స‌హా వివిధ అంశాల‌పై మ‌మ‌తా బెన‌ర్జీ మాట్లాడారు. ప‌శ్చిమ బెంగాల్‌లో తాము వ్య‌తిరేకించే వ‌ర‌కు స‌ర్ అంశంపై ఎవ‌రూ మాట్లాడ‌లేద‌న్నారు. స‌ర్ ద్వారా ఓట్లు...