వరుసగా రెండో రోజూ తగ్గిన బంగారం ధరలు..
బంగారం ధరల పతనం కొనసాగుతున్నది. సోమవారం కొంతమేరకు తగ్గిన పసిడి ధరలు మంగళవారం కూడా అదేబాటలో పయనించాయి. ఇవాళ ఒక్కరోజే తులం బంగారంపై సుమారు రూ.2,500 వరకు తగ్గింది. దాంతో కొనుగోలుదారులు మార్కెట్ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణభయాలు.. అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు ఆకర్షణీయంగా మారడం వంటి అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై మదుపర్లలో ఆసక్తి తగ్గుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇవాళ ఉదయానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల...