అహం వీడితే ఆనందం

కోపం తాపం వద్దు పగలు పట్టింపుల పద్దులు వద్దు కుట్రలు కుయుక్తుల కుళ్ళు వద్దు సంతృప్తి మన సంపద కావాలి సంతోషమే మన భూషణం కావాలి సద్గుణం సహనమే మన సౌభాగ్యం కావాలి అహం వీడితే ఆనందం అలుకలు మానితె అహల్లాధం ఆందోళనలు వద్దు ఆనందమే ముద్దు పరోపకారమే మన జీవనశైలైతే పగలు సెగలు అంతరించి ప్రగతి పురోగతి పరుగెడుతుంది ఆత్మీయతే పరమానందం అక్కున చేర్చుకునే మనసే మన ఆస్తి కావాలి ఆస్తుల అంతస్తుల అధికార హోదాల దర్పణం వద్దు డబ్బు జబ్బు మబ్బులు వద్దు ఆర్తత ఆప్యాయత ఆత్మీయతే ముద్దు కలిమిడి తనమే నీ జీవనవిధానం కావాలి పరోపకారం ప్రగతిశీలతే ముద్దు మన బాట...