డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు పొడిగింపు

దేవరకొండ 19సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ (బి.ఎ, బి.కాం, బి.ఎస్సీ) ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30, 2026 వరకు చివరి గడువు ఉన్నట్లు మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (దేవరకొండ) ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమావత్ రవి మరియు సహాయ కేంద్రం-121 కోఆర్డినేటర్ డాక్టర్ వి. మకట్లాల్ తెలిపారు. ​ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని వారు సూచించారు. కోర్సులకు సంబంధించిన విద్యార్హతలు, ఫీజు వివరాలు తదితర సమగ్ర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్ లో పొందుపరిచినట్లు వెల్లడించారు. ​అలాగే, ఇదే విశ్వవిద్యాలయంలో చదువుతున్న ద్వితీయ...