విద్యా వ్యవస్థకు వెన్నెముకగా అతిథి అధ్యాపకులు.. జీతాల కోసం ఎదురుచూపులు ఎందుకు?

దేవరకొండ 18సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) : నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు – కళాశాలల అభివృద్ధిలో మాత్రం నిరంతర భాగస్వామ్యం – అతిథి అధ్యాపకుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యాబోధన సజావుగా సాగడంలో అతిథి అధ్యాపకులు కీలక పాత్ర పోషిస్తున్నారు. శాశ్వత అధ్యాపకుల కొరత ఉన్న చోట విద్యార్థులకు బోధన అందిస్తూ, కళాశాల విద్యా ప్రమాణాలను నిలబెట్టడంలో వారు తమ వంతు కృషి చేస్తున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరంతరం పనిచేస్తున్న ఈ అతిథి అధ్యాపకుల కుటుంబాల భవిష్యత్తు మాత్రం వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నాలుగు నెలలుగా జీతాల...