పత్తికి పెరిగిన డిమాండ్..
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో ఈసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోళ్ల అవసరం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో వర్షాభావ పరిస్థితుల వల్ల పత్తి సాగు గణనీయంగా తగ్గింది. దీంతో దేశ వ్యాప్తంగా పత్తికి డిమాండ్ పెరిగింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొత్తపత్తి రాక మొదలైంది. గరిష్ట ధర రూ.9,200, మోడల్ ధర రూ.9,100 నమోదైంది.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2026-27 సీజన్ మద్దతు ధర రూ.8,667 కాగా, జమ్మికుంట వ్యవసా య మార్కెట్లో గురువారం రూ.8,700 ధర పలికింది. ఈ సీజన్లో మద్దతు ధరను అధిగమించి పత్తి ధరలు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీఐ కొనుగోళ్లకు పెద్దగా...