కూరగాయల సాగుతో నిరంతర ఆదాయం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన పలువురు రైతులు తక్కువ నీటి వినియోగంతో కూరగా యలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వ్యవ సాయ శాఖ సూచనలు, సల హాలు పాటిస్తూ అధునాతన పద్ధతులతో ఆరుతడి పంట లు, కూరగాయలు సాగు చేస్తూ ఎల్నినో ప్రభావాన్ని అధిగమిస్తున్నారు. ఆరుతడి పంటలపై దృష్టి గ్రామానికి చెందిన కంకణాల రమేష్ మూడు సంవత్సరాలుగా బీరకాయలు, టమాట, మిర్చి, సొరకాయ, బంతి సాగు చేస్తున్నాడు. తన రెండెకరాల పొలంతో పాటు మరో 5 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని కూర గాయలు సాగు చేస్తున్నాడు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటలు...