ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

శంకరపట్నం,సెప్టెంబర్17,( తెలంగాణ కిరణం విలేఖరి ):శంకరపట్నం మండల కేంద్రంలో తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సురేఖ,ఎంపిడిఓ అనిత జాతీయ జెండాను ఎగరవేశారు.అధికారులు సిబ్బంది జనగణమన జాతీయ గీతాన్ని ఆలపించారు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గురించి వారు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.