భారీ ప‌త‌నం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్‌లు..

భారత స్టాక్ మార్కెట్‌లు మంగళవారం (నిన్న‌టి) నాటి భారీ పతనం నుంచి కోలుకున్నాయి. ఇవాళ (బుధ‌వారం) ట్రేడింగ్ లాభాల‌తో మొద‌లైంది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ , నిఫ్టీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో సెన్సెక్స్ 456 పాయింట్ల లాభంతో 74,460 వద్ద.. నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 23,254 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. జీఐఎఫ్‌టీ నిఫ్టీ నుంచి అందిన సానుకూల సంకేతాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి.మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 777 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది. ఇది గత ఐదు నెలల్లో నిఫ్టీకి అత్యంత కనిష్ఠ ముగింపు స్థాయి కావడం గమనార్హం....