గిరిజనుల అభివృద్ధికి చట్టబద్ధత కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమే
గిరిజనుల అభివృద్ధికి చట్టబద్ధత కల్పించి, అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. గిరిజనుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం లేదని విమర్శించారు.యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. 2022-23లో ఎస్టీ డెవలప్మెంట్ స్పెషల్ ఫండ్ కింద రూ.13,412.63 కోట్లు కేటాయించగా.. 2023-24లో ఆ మొత్తాన్ని రూ.15,232.62 కోట్లకు పెంచినట్లు చెప్పారు.గిరిజన రైతులకు సాగుకు పనికిరాని...