వినాయక మాల వేసుకున్నారని..
గణేష్ నవరాత్రుల సందర్భంగా పలువురు విద్యార్థులు (గణేష్ దీక్ష) వినాయక మాల ధరించారు. మంగళవారం గణేష్ మాల (కండువా) ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్నారు. మాల విరమణ చేస్తేనే స్కూల్‌కు రావాలని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ స్కూల్‌కు చేరుకొని విద్యార్థులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.దీంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులు తండ్రి కె. శ్రీకాంత్ మాట్లాడుతూ.. హనుమకొండ 4వ డివిజన్ మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు, కుమారుడు కొన్నేళ్లుగా చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 14న...