తెలంగాణ‌కు ప‌ట్టిన దెయ్యం కాంగ్రెస్

రైతుల కోసం ఏది అడిగినా ప్ర‌భుత్వం ఎల్‌నినో పేరు చెబుతుంది. తెలంగాణ‌కు ప‌ట్టింది ఎల్‌నినో కాద‌ని అది కాంగ్రెస్ దెయ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయ‌న మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింద‌న్నారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్ర‌భావం ఉన్నప్పటికీ కృష్ణా, గోదావరి జలాలు వచ్చిన‌వి. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు ఆన్ చేసినా కూడా నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుండి సాగర్‌కు నీళ్లు వచ్చినా కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. సాగర్ ఎడమ కాల్వ ద్వారా 11,000 క్యూసెక్కుల నీరు ఇచ్చే అవకాశం...