పాకిస్తాన్‌లో మైనర్ హిందూ బాలికలు కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. కోర్టులోనూ దక్కని న్యాయం
పాకిస్తాన్‌లో మైనారిటీలపై వేధింపులు, దాడులు సాధారణమయ్యాయి. ముఖ్యంగా హిందూ యువతుల్ని కిడ్నాప్ చేసి, బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. తాజాగా, అలాంటి ఒక ఘటనే ఇటీవల పాకిస్తాన్‌లో జరిగింది. 13, 14 ఏళ్ల వయసున్న హిందూ అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి, బలవంతపు మత మార్పిడి చేశారు. అనంతరం పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 9న పాకిస్తాన్, సింధ్ ప్రాంతంలోని తాండో అల్లహ్యార్ జిల్లాలో జరిగింది. ఈ ప్రాంతంలో హిందువులు ఎక్కువగా ఉంటారు.కచ్చి కోల్హి అనే హిందూ మతానికి చెందిన 13, 14 ఏళ్ల బాలికలను అంజాద్ సోలాంగి, మన్సూర్ సోలాంగి అనే ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. అనంతరం...