బ్రిడ్జి నిర్మిస్తుండ‌గా కూలిన బీమ్ లాంచ‌ర్..

బిహార్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఒక బ్రిడ్జి నిర్మిస్తుండ‌గా బీమ్ లాంచ‌ర్, కాంక్రీట్ స్లాబ్ కూల‌డంతో ఎనిమిది మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌న బిహార్‌లోని వైశాలి జిల్లాలోని లాల్‌గంజ్ ఏరియాలో గురువారం జ‌రిగింది. ఇక్క‌డ భార‌త్‌మాలా స్కీం కింద నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) ఎన్‌హెచ్-139 డ‌బ్ల్యూ ప‌రిధిలో నాలుగు లేన్ల ర‌హ‌దారి నిర్మిస్తున్నారు.దీనిలో భాగంగా ఒక బ్రిడ్జి నిర్మాణం జ‌రుగుతోంది. దీనిలో భాగంగా నిర్మించిన ఒక బీమ్ లాంచ‌ర్, కాంక్రీట్ స్లాబ్ ఉన్న‌ట్లుండి కుప్ప‌కూలిపోయింది. దీంతో ఈ స‌మ‌యంలో అక్కడ ప‌ని చేస్తున్న ఎనిమిది మంది కార్మికులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి...