దేవరకొండ నియోజకవర్గంలో ప్రజా నేతగా నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక గుర్తింపు
దేవరకొండ 09సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) : దేవరకొండ గడ్డపై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల మధ్యే ఉండే నాయకుడిగా ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే నాయకుడిగా ఆయనకు ప్రజల్లో బలమైన ఆదరణ ఉంది. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజల పక్షాన నిలబడటమే తన రాజకీయ ధ్యేయంగా బాలు నాయక్ ముందుకు సాగుతున్నారు. దేవరకొండ ప్రాంతంలో మారుమూల తండాలు, గిరిజన గూడేలు మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయన తన హయాంలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజల మదిలో నిలిచి ఉన్నాయి. రోడ్లు, తాగునీరు,...