మా నేతలను విమర్శిస్తే ఊరుకోం.. అనిల్‌కు కోటంరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మాజీ మంత్రి అనిల్ కుమార్‌పై తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు ( బుధవారం) నెల్లూరు వేదికగా మీడియాతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. అనిల్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘జిల్లాలో ఏ వైసీపీ నేత నీ వెంట ఉన్నారో చెప్పు అనిల్’ అని సవాల్ చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చీమకు కూడా అపకారం చేయని తత్వం ఉండే వ్యక్తులను.. తాను ముగ్గురిని చూశానని తెలిపారు. ఒకరు మాజీ ఎమ్మెల్యే జేకే రెడ్డి, మరొకరు మాగుంట సుబ్బిరామిరెడ్డి, వీరి తర్వాత...