టీవీ లైవ్‌కు కొన్ని క్షణాల ముందు భారీ పేలుడు..

దక్షిణ లెబనాన్‌‌లో భయానక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ కోసం సిద్ధమవుతుండగా.. అతడికి కొద్దిదూరంలోనే భారీ పేలుడు సంభవించింది. దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరామ్యాన్‌కు గాయాలు అయ్యాయి. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...దక్షిణ లెబనాన్‌లోని నబాతిహ్ నగరంలో 'అల్-మనార్' టీవీకి చెందిన రిపోర్టర్ లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. మరికొన్ని సెకన్లలో లైవ్ అవ్వనుండగా.. ఆ ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. రిపోర్టింగ్ జరగాల్సిన ప్రదేశంలో భారీ పేలుడు సంభవించింది. ఇజ్రాయెల్ దాడిలో రిపోర్టర్ అలీ షబీబ్, కెమెరామ్యాన్ మొహమ్మద్ బర్జావి గాయపడ్డారు. రెస్క్యూ టీమ్ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి...