ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో 75 లీటర్ల విదేశీ మద్యంతో పట్టుబడ్డ 25 ఏళ్ల మహిళ..
ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో సుమారు 75 లీటర్ల విదేశీ మద్యంతో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల నేహా జాను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని సమస్తిపుర్ జంక్షన్‌లో ఆమెను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు వీడియో తీశారు. కానీ ఒక్క క్షణం కూడా ఆమె తడబడినట్లు కనిపించలేదు. చాలా కూల్‌గా ఆమె పోలీసులకు సమాధానం ఇచ్చింది. చాలా స్పష్టంగా ఆంగ్లభాషలో ఆమె మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. కంపార్ట్‌మెంట్‌లో సెర్చ్ చేస్తున్నా.. ఆమె మాత్రం తన మొబైల్‌ను చూసుకుంటూ ఉండిపోయింది.ఢిల్లీ నుంచి బీహార్ వరకు హెచ్-1 ఫస్ట్ ఏసీ కోచ్‌లో నేహా ప్రయాణించింది. బంధువు ఇషాన్ కుమార్ పేరిట బర్త్‌ను బుక్ చేశారు. టికెట్ లేకుండా...