పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వేల వేల డాల‌ర్లు బాకీ ఉన్న‌ది

పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ బౌల‌ర్ జేస‌న్ గిలెస్పీ గ‌తంలో కోచ్‌గా చేశారు. అయితే ప్ర‌స్తుతం పాక్ క్రికెట్‌లో జ‌రుగుతున్న సంక్షోభ ప‌రిణామాల‌పై గిలెస్పీ స్పందించారు. పాక్ క్రికెట్ జ‌ట్టు చీఫ్ సెలెక్ట‌ర్‌గా ఆకిబ్ జావిద్‌ను నియ‌మించిన త‌ర్వాత ఆ దేశ జాతీయ జ‌ట్టు క్షీణించిన‌ట్లు గిలెస్పీ పేర్కొన్నారు. పీసీబీ చైర్మెన్ మోషిన్ న‌ఖ్వీ నియ‌మించిన ఆకిబ్ జావిద్ త‌న‌కు న‌చ్చిన‌ట్లు వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆసీస్ బౌల‌ర్ ఆరోపించాడు. ఆకిబ్ నియామ‌కంతో పాక్ క్రికెట్‌లో క్షీణ ద‌శ మొద‌లైంద‌ని, అత‌ని రాక త‌ర్వాత పాక్ క్రికెట్‌తో త‌న రిలేష‌న్ కూడా మారింద‌న్నాడు. అప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌కు ఉన్న త‌న బాధ్య‌త‌లు, పాత్ర మారిన‌ట్లు చెప్పాడు....