కేసీఆర్‌పై దాడికి బయలుదేరిన కాంగ్రెస్‌ గూండాలు..

కాంగ్రెస్‌ గుండాల దాడులను బీఆర్‌ఎస్‌ శ్రేణులు తిప్పికొడుతున్నాయి. కేసీఆర్ మీద దాడి చేయడానికి యాదాద్రి జిల్లా నుంచి కేసీఆర్ నివాసానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులను సిద్దిపేట జిల్లా మర్కుక్ దామరకుంట వద్ద అడ్డుకుని దేహశుద్ది చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కాగా, కాంగ్రెస్‌ పార్టీ బరితెగింపు రాజకీయాలక పాల్పడుతున్నది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే దమ్ములేక సీఎం రేవంత్ రెడ్డి నీచ రాజకీయాలకు తెరతీశాడు. ఉద్యమ నాయకుడు, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై హత్యాయత్నానికి ప్లాన్ చేయడం సంచలనంగా మారిందిఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం మీద దాడికి కాంగ్రెస్ గుంపు బయలుదేరి వెళ్లడం కలకలం రేపింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్...