LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే చేస్తారా

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈరోజు(సోమవారం) మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత బయటకు రారని.. ఎల్పీ మీటింగ్ కూడా ఫౌంహౌస్‌లోనే చేస్తారా అంటూ ప్రశ్నించారు. రాజకీయ రాద్ధాంతం తప్ప బీజేపీ, బీఆర్ఎస్‌లకు సమస్యలు పట్టవా అని నిలదీశారు. చట్టాలు చేసే పవిత్ర దేవాలయం అసెంబ్లీ అని.. సమావేశాలకు రాకుండా బయట నిరసన ఎందుకని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. సభ ప్రారంభం కాగానే బీజేపీ నిరసన దేనికంటూ ఫైర్ అయ్యారు. చర్చిస్తామంటే నిరసన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షం తెలంగాణలో లేదన్నారు. ప్రతిపక్షాలకు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటూ దుయ్యబట్టారు.బీజేపీ, బీఆర్ఎస్‌లు డ్రామా...