పత్రిక ప్రకటన జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.

స్థానిక మధుర నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు అధ్యాపకులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ "సమాజంలో గురువు పాత్ర ఎప్పటికీ మరవలేనిదని, ఎంత technology పెరిగిన గురువు Replace చేయడం ఎప్పటికీ సాధ్యం కాదని. సమయం సందర్భాన్ని బట్టి విద్యార్థి మానసిక స్థితిగతులను గమనిస్తూ వారికి అవసరమైన జ్ఞానాన్ని అందించడం గురువులకే సాధ్యమని. వారి నిరాశ, నిస్పృహలను గమనించి అప్పటికప్పుడు ధైర్యాన్ని , స్థైర్యాన్ని , అందిస్తూ ఉన్నత తీరాలకు చెర్చేది గురువుల మాత్రమేని ఈ సందర్భంగా పేర్కొన్నారు". ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా...