రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం

కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొడంగల్‌లో నిర్వహించిన గురుపూజోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పిల్లల భవిష్యత్‌ తరగతి గదుల్లోనే ఉందని సర్వేపల్లి చెప్పేవారని తెలిపారు. గురువు గొప్పదనాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. విద్యారంగంలో 17వ స్థానంలో తెలంగాణ.. పిల్లల ఎదుగుదల, భవిష్యత్‌కు పునాది వేసేది టీచర్లే అని.. పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే అని సీఎం చెప్పుకొచ్చారు. విద్యారంగంలో తెలంగాణ ఎన్నో విజయాలు సాధించిందన్నారు. విద్యాశాఖలో అనేక...