పిల్లలు స్క్రీన్‌కు బానిసవుతున్నారు.. టీచర్లతో ప్రధాని మోదీ
ఇవాళ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం. జాతీయ టీచర్ అవార్డులు గెలిచిన వారితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఢిల్లీలోని 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఈ కార్యక్రమం జరిగింది. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలిచిన వారితో మాట్లాడుతూ.. పిల్లలు ఎక్కువగా స్క్రీన్‌కు బానిస అవుతున్నట్లు చెప్పారు. మొబైల్ ఫోన్లకు పిల్లలు హత్తుకుపోతున్నారన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ క్రీడల పట్ల పిల్లలో ఆసక్తి పెరిగితే, అప్పుడు ఆ స్క్రీన్ బానిసత్వం నుంచి వాళ్లు బయటపడే అవకాశాలు ఉంటాయని ప్రధాని మోదీ అన్నారు. క్రీడలు అంటే వీడియో గేమ్స్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. పిల్లల్లో సృజనాత్మక పెంచాలని, వారిలో ఆటల పట్ల ఆసక్తి పెంచేలా...