గుండె జ‌బ్బుల‌కు కేవ‌లం కొలెస్ట్రాల్ మాత్ర‌మే కాదు, ఇది కూడా కార‌ణ‌మే..

గుండె జబ్బుల విషయంలో కొలెస్ట్రాల్‌ మాత్రమే ప్రధాన కారణమని చాలాకాలంగా భావిస్తూ వచ్చారు. అయితే రక్తనాళాల్లో దీర్ఘకాలికంగా కొనసాగే వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) కూడా గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని వైద్య పరిశోధనలు తెలియ‌జేస్తున్నాయి. ఈ వాపు ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండా నిశ్శబ్దంగా కొనసాగే అవ‌కాశాలు ఉంటాయి. అయితే రక్తనాళాలు క్రమంగా ఇరుకుగా మారుతున్నప్పుడు గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గి కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయి. ఇన్‌ఫ్లమేషన్‌ అనేది గాయం లేదా ఇన్‌ఫెక్షన్‌ వంటి పరిస్థితులకు శరీర రోగనిరోధక వ్యవస్థ సహజంగా స్పందించే ప్రక్రియ. అయితే ఈ స్పందన దీర్ఘకాలం కొనసాగితే అది శరీరానికి హానికరంగా మారుతుంది. గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో...