ఈశ్వర్ సాయి వివాదంలో భార్య శరణ్య సంచలన వ్యాఖ్యలు..
ప్రముఖ ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, డ్యాన్సర్ మాధురి రాథోడ్ మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఈశ్వర్ సాయి భార్య శరణ్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వివాదం చోటుచేసుకున్న రోజు నుంచి పోలీసుల జోక్యం, లీకైన ఆడియో కాల్, కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల వరకు పలు విషయాలపై ఆమె తన వాదనను వెల్లడించారు. ఈ సందర్భంగా శరణ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. అయితే ఆమె వెల్లడించిన విషయాలు ఆమె వాదనగా మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది. ఘటన జరిగిన రోజును గుర్తు చేసుకుంటూ శరణ్య కీలక విషయాలను వెల్లడించారు. మొదట మాధురిని కొట్టానని, ఆ తర్వాత...