నేపాల్‌ బాధితుల సాయంపై ట్రోలింగ్‌..

నేపాల్‌ వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన ప్రముఖ నటుడు సోనూసూద్‌పై సోషల్ మీడియా వేదికగా విమ‌ర్శ‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. సహాయక చర్యల కోసం ఆయన నేపాల్‌లో పర్యటించడం కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని, గ్రౌండ్‌లో పనులు ప్రారంభం కాకముందే కొందరు ఆయనను దేవుడిగా చిత్రీకరిస్తూ మార్కెటింగ్ చేసుకుంటున్నారంటూ ఒక జర్నలిస్ట్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.అయితే ఈ ట్రోలింగ్‌ను ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని సోనూసూద్, చాలా కూల్‌గా స్పందించారు. ‘సోదరా.. మీ మనసు చాలా మంచిది. మీరు నేపాల్‌కు దయచేసి రండి. మన ఇద్దరం కలిసి అక్కడ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి సాయం చేద్దాం’ అంటూ సానుకూలంగా రిప్లై ఇచ్చారు. ఎలాంటి వివాదాలకు...