ప్రోటీన్లను జీర్ణం చేయడంలో అద్భుతంగా పనిచేసే పైనాపిల్..
భోజనం తర్వాత పైనాపిల్ తినడం వల్ల జీర్ణక్రియకు కొంత మేలు జరిగే అవకాశం ఉందని నిపుణుల పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ప్రొటీన్లను చిన్న భాగాలుగా విడగొట్టడంలో సహాయపడుతుంది. అందుకే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న తర్వాత పరిమిత మోతాదులో పైనాపిల్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ ప్రొటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్‌ల సమూహానికి చెందినది. మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, పప్పులు వంటి ఆహారాల్లో ఉండే సంక్లిష్ట ప్రొటీన్లను జీర్ణక్రియ సమయంలో చిన్న పెప్టైడ్లు, అమైనో ఆమ్లాలుగా విడగొట్టడంలో ఇది సహాయపడుతుంది. ఇవి శరీరం సులభంగా గ్రహించగలిగే రూపాలేనని...