ఎంఎస్‌ఎంఈల హరిత రూపాంతరానికి ప్రోత్సాహం

తెలంగాణలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను హరిత పరిశ్రమలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ర్యాంప్‌ కార్యక్రమంలో భాగంగా ‘గ్రీనింగ్‌ ఆఫ్‌ ఎంఎస్‌ఎంఈఎస్‌ ఇన్‌ తెలంగాణ’ ఆధ్వర్యంలో ఆర్‌ఈసీపీ (వనరుల సామర్థ్యం–స్వచ్ఛ ఉత్పత్తి)పై గురువారం ములుగులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్‌ఐసీహెచ్‌, సీఐఐ సాంకేతిక భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ములుగు, భూపాలపల్లి జిల్లాలకు చెందిన ఎంఎస్‌ఎంఈల యజమానులు, రైస్‌మిల్లర్లు, ప్లాంట్‌ మేనేజర్లు పాల్గొన్నారు. విద్యుత్‌ పొదుపు, విద్యుత్‌ శక్తి వినియోగ సామర్థ్యం, ఇంధన సామర్థ్య మోటార్లు, సౌర విద్యుత్‌, నీటి సంరక్షణ, వ్యర్థాల తగ్గింపు తదితర అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.