నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17

భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్‌-05ను నింగిలోకి పంపేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ఇప్పటికే ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మిషన్‌లో భాగంగా 2,367 కిలోల బరువున్న ఈఓఎస్‌-05 ఉపగ్రహాన్ని ఉప-భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భూ పరిశీలన సామర్థ్యాలను మరింత విస్తరించే ఈ ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు. విపత్తుల పర్యవేక్షణకు కీలకం.. ఈఓఎస్‌-05 ఉపగ్రహం ద్వారా పెద్ద భూభాగాలకు సంబంధించిన చిత్రాలను తరచుగా సేకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిస్థితులను...