శ్రీకృష్ణుడు గొప్ప వ్యూహకర్త, రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు.

సంక్షోభ నివారణ కోసం... రాజకీయం ఎప్పుడూ అధికారం, సంప్రతింపులు, చర్చలు, వ్యూహాలతో సాగుతూ ఉంటుంది... బలవంతంగా అణచివేసే క్రూరత్వంతో కాదు. ‘‘నీతివర్తనులు, శక్తిమంతులు, శూరులు అయిన మిత్రులతో సంధి చేసుకోవాలి. ఉత్తమమైన మిత్రుల సలహాలు తీసుకుంటూ పాలన సాగించాలి. శాంతి కావాలంటే బలం, బలగం ఎంత ముఖ్యమో... వివేకం, జ్ఞానం కూడా అంతే ముఖ్యం.అసలు యుద్ధం వరకూ వెళ్ళనే వెళ్ళకూడదు. ఒక వేళ వెళ్ళాల్సి వస్తే... ‘నా అంతటివాడు లేడు’ అనే అహంకారాన్ని వదిలెయ్యాలి. తర తమ భేదం లేకుండా మిత్రులు అనుకున్న రాజులందరితో పొత్తులు పెట్టుకోవాలి. నీవాళ్ళు అనుకున్న వారందరినీ చేరదీయాలి. సత్సంబంధాలు పెంచుకోవాలి’’ అని హితవు చెప్పాడు శ్రీకృష్ణుడు. యుద్ధం అంటేనే వినాశనం,...