‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా రివ్యూ
రాజకీయాలు అంటే కేవలం ఓట్ల వేట, పదవుల కోసం పాకులాట మాత్రమే కాదని, అది ప్రజల భవితను నిర్ణయించే బాధ్యత అని చెప్పే ప్రయత్నమే ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో పేరుకుపోయిన రాజకీయ అవినీతిని, యువతను పెడదోవ పట్టిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని ప్రశ్నిస్తూ రూపొందిన ఈ చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. కథ ధర్మస్థల నియోజకవర్గంలో ఎలాంటి పోటీ లేకుండా వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న బైరాజ్ (సాయికుమార్) అరాచకాలకు అడ్డులేకుండా పోతుంది. ప్రజలకు ఏమాత్రం మేలు చేయని ఆ నాయకుడి ఏకఛత్రాధిపత్యానికి,...