తానా ప్రపంచ సాహిత్య వేదిక 95వ అంతర్జాల సమావేశం విజయవంతం

వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ అంతర్జాల సమావేశాన్ని నిర్వహించింది. ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై ఆదివారం జరిగిన ఈ సమావేశం విజయవంతంగా కొనసాగింది. తానా సంస్థ సాహిత్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా గత ఆరు సంవత్సరాలుగా ప్రతి నెలా చివరి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆదివారం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమైంది. పలువురు ప్రముఖులు పాల్గొని తెలుగు భాష ప్రాధాన్యత, పరిరక్షణ, అభివృద్ధి, భవిష్యత్‌ తరాలకు భాషను అందించాల్సిన బాధ్యతపై...