యాదాద్రి భువనగిరి జిల్లాలో చేపల వలలో చిక్కుకుని వ్యక్తి మృతి..
యాదగిరిగుట్ట పట్టణంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చేపల వేట కోసం నల్లచెరువుకు వెళ్లిన ముక్కర్ల సత్తయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని చెరువులో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంత ప్రయత్నించినా సత్తయ్య ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. చివరకు శుక్రవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ రిస్క్ టీం, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యల్లో సత్తయ్య మృతదేహం లభ్యమైంది.మృతదేహాన్ని తహసీల్దార్ గణేష్ నాయక్, సీఐ బొడ్డుపల్లి భాస్కర్, మున్సిపల్...